calender_icon.png 22 September, 2024 | 12:59 PM

సాగర్ జలాశయంలో నీటి కుక్కల సందడి

22-09-2024 02:43:28 AM

ఆంజనేయ పుష్కర ఘాట్ వద్ద దర్శనం

నల్లగొండ, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయంలో శనివారం నీటి కుక్కలు సందడి చేశాయి. పైలాన్ కాలనీలోని కొత్త వంతెన సమీపంలో ఆంజనేయ పుష్కర ఘాట్ వద్ద నీటి కుక్కల సమూహం దర్శనమిచ్చింది. చాలా అరుదుగా జలాశయంలో ఇవి కనిపిస్తుంటాయి. నీటిలో, నేలమీద సైతం ఇవి జీవించగలవు. ప్రస్తుతం నీటి కుక్కలు కనుమరుగవుతున్నాయనిఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో సాగర్ జలాశయంలో ఇవి దర్శనమివ్వడంతో జంతు శాస్త్రవేత్తల నుంచి సంతోషం వ్యక్తమవుతున్నది.

నీటి కుక్కల తల చూసేందుకు ముంగిస, మెడ  సీల్ చేపను పోలి ఉంటుంది. ఇవి అలికిడి లేని నీటి వనరుల్లో ఎక్కువగా తిరుగుతుంటాయి. పెద్దపెద్ద చేపలను ఆహారంగా తీసుకొని జీవిస్తుంటాయి.రెండేళ్ల క్రితం సాగర్ జలాశయంలో వీటి కదలికలను గుర్తించారు.ఆ తరువాత కనిపించకుండా పోయాయి. తాజాగా మళ్లీఇవి జలాశయంలో సంచరించడంతో వీటి సంతతి పెరిగి ఉంటుందని జంతు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.