calender_icon.png 5 February, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెలాఖరున ఆది శబ్దం

05-02-2025 12:18:38 AM

ఇంతకుముందు ‘వైశాలి’తో సూపర్ హిట్ కాంబోగా నిలిచిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ మరో ఆసక్తికరమైన సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌తో వస్తున్నారు. ఈ ఉభయులు రెండోసారి చేతులు కలిపిన ఆ చిత్రమే ‘శబ్దం’. 7జీ ఫిల్మ్స్ శివ నిర్మిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి.

దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 28న తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  ఇందులో లక్ష్మి మీనన్ హీరోయిన్. సిమ్రాన్, లైలా, రెడిన్ కింగ్స్లీ, ఎంఎస్ భాస్కర్, రాజీవ్ మీనన్ కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు.