30-01-2025 12:00:00 AM
నేడు మహాత్మాగాంధీ వర్ధంతి :
రవి అస్తమించని సామ్రాజ్యంలో
మహాత్ముడి విగ్రహం
విశ్వశాంతి కిరీటమై
ప్రజ్వరిల్లుతుంటే
కాలపు కలం లిఖిస్తున్న ఉత్తేజపు చరిత
ఎవరు రాయగలరు?
ఈ శతాబ్దపు శబ్దం
నిశ్శబ్దపు నిర్మాణమై
సత్యాగ్రహపు పాదముద్రలతో
దండియాత్ర స్ఫూర్తితో ప్రయాణిస్తున్నది
సత్యం కొన్ని వేలకోట్ల ఉషోదయాలకు
ఊపిరి పోస్తూ నేడు
నా దేశ సుప్రభాత గీతమై
జగతిని జాగృతం చేస్తున్నది
అహింస అపజయం ఎరుగక
అంతర్ధానమైన ‘డూ ఆర్ డై’ ధ్వనిస్తూ
మళ్ళీమళ్ళీ హింసపై
విరామ మెరుగక గెలుస్తూనే వుంది..
అంతటా యుద్ధ ద్వేషపు ఛాయలు
మెల్లగా అలుముకుంటున్న
ఈ నవ తరుణంలో
ప్రేమాభ్యుదయాన్ని ప్రతిష్ఠించడానికై
బాపూజీ ఈ అవనిపైనే మళ్ళీ పుట్టాలి!
మనందరికీ మానవత్వపు
ఏకత్వాన్ని నేర్పాలి!!
ఫిజిక్స్ అరుణ్ కుమార్
సెల్: 9394749536