శ్రీ అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరిగి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఉత్సవాలు...
కామారెడ్డి (విజయక్రాంతి): అయోధ్యలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చర్మల్ తండాలో ఉత్సవాలను నిర్వహించారు. గాంధారి మాజీ జెడ్పిటిసి బీజేపీ నాయకులు తానాజీ రావు నాయకత్వంలో బోర్ బండార్ కార్యక్రమాన్ని గిరిజన యువతి యువకులు యువకులు పాల్గొని సందడి చేశారు. గాంధారి మండలం చద్మల్ తండాలో వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ హరాలే తానాజీ రావు(EX ZPTC) బిజెపి రాష్ట్ర నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమర్ సింగ్ నాయక్, పెంటయ్య నాయక్, దేవిసింగ్ నాయక్, రతిరం, మురారి, జగదీష్, శ్రీకాంత్, తండా ప్రజలు మహిళలు పాల్గొన్నారు.