26-03-2025 12:00:00 AM
కుటుంబ కలహాలే కారణ?
మేడ్చల్, మార్చి 25 (విజయక్రాంతి): తండ్రిని గొంతు నులిమి కుమారుడు హత్య చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం అర్ధరాత్రి పాత్లవత్ శంకర్‌ను కుమారుడు జగదీష్ గొంతునులిమి హత్య చేశాడు.
కుటుంబ కలహాల వల్లే హత్య చేసినట్టు తెలిసింది. స్థానికుల సమాచారంతో కుషాయిగూడ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.