calender_icon.png 14 November, 2024 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పని చేయడం లేదంటూ నిలదీసిన కొడుకు

10-11-2024 01:24:51 AM

  1. క్షణికావేశంలో కత్తితో దాడిచేసిన తండ్రి 
  2. చికిత్స పొందుతూ మృతిచెందిన కుమారుడు

ఎల్బీనగర్, నవంబర్ 9 : పనిచేయకుండా ఎందుకు తిరుగుతున్నావ్? అని నిలదీసిన కొడుకుపై ఆవేశానికి గురైన తండ్రి కత్తితో దాడిచేయగా.. తీవ్ర గాయాలకు గురైన కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందు తూ మృతి చెందిన ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది.

సీఐ సైదిరెడ్డి తెలిపిన వివరాలు.. వీరనగరి రాములు.. కుమారుడు జైపాల్ (23),  కుమార్తెతో కలిసి కర్మన్‌ఘాట్‌లోని న్యూమారుతీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. జైపాల్ డిగ్రీ  మధ్యలోనే వదిలేసి కుటుంబ పోషణ నిమిత్తం ఫ్లవర్ డెకరేషన్ వర్క్ చేస్తున్నాడు. అయితే.. తండ్రి రాములు ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు.

ఈవిషయమై శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పనిచేయకుండా ఎందుకు ఖాళీగా తిరుగుతున్నావ్ అని కొడుకు.. తండ్రిని ప్రశ్నించడంతో సహనం కోల్పోయిన తండ్రి రాములు కూరగాయలు కోసే కత్తితో కుమారుడు జైపాల్ మెడపై దాడి చేశాడు. జైపాల్‌కు తీవ్రరక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

వెంటనే కుటుంబ సభ్యులు అతడిని స్థానికంగా ఉన్న ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి జైపాల్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు.