ముంబై, జూలై 7: మహారాష్ట్రలో శివసేన నేత కుమారుడి నిర్వాకంతో ఓ మహిళ ప్రా ణాలు కోల్పోయింది. నిందితుడు తన బీఎండబ్ల్యూ కారుతో మహిళ, ఆమె భర్త ప్రయా ణిస్తున్న స్కూటీని వేగంగా ఢీకొట్టాడు. దీంతో మహిళ గాల్లోంచి ఎగిరి 100 మీటర్ల దూ రంలో పడిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ముంబైలోని వర్లీ అట్రియా మాల్ సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆదివారం ఉదయం 5.30 గంటలకు పార్థిక్ నక్వా, కావేరీ దంపతులు మార్కెట్ వెళ్లి తిరిగి తమ ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతున్నారు. శివసేన పార్టీ నేత రాజేశ్ షా కుమారుడు మిహిర్ షా నడుపుతున్న కారు పార్థిక్ స్కూటీని బలంగా ఢీకొట్టింది. దీంతో కావేరీ ప్రాణాలు కోల్పో గా.. పార్థిక్ తీవ్రగాయాలతో నాయర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారును వర్లీ పోలీసులు సీజ్ చేశారు. కారు శివసేన పార్టీ నేత రాజేశ్‌కు చెందినదేనా? ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేస్తున్నదెవరో త్వరలో నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు.
సీఎం ఆగ్రహం..
తమ పార్టీ నేత కుమారుడు హిట్ అండ్ రన్ కేసులో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందంటూ వార్తలు వైరల్ కావడంతో సీఎం షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు.