26-02-2025 05:04:25 PM
పిట్లం (విజయక్రాంతి): సమాజంలో మానవత్వం రోజు రోజుకి మంట కలిసిపోతుంది. క్షణికావేశానికి లోనై నవ మాసాలు మోసిన తల్లి, తోబుట్టు వంటి రక్త సంబంధాలని కూడా చూడకుండా కన్నవారే అంత ముందిస్తున్నారు ఆస్తి వివాదంలో మొదట సొంత తమ్ముడు, ఆ తర్వాత తల్లిని హత్య చేసిన ఘటన పిట్లం మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పిట్లం ఎస్ఐ రాజు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన సాబెరా బేగం (60) గృహిణి 2021లో జరిగిన ఆస్తి వివాదంలో తన రెండవ కొడుకు షాదుల్, మూడవ కొడుకు ముజీబ్ ని కత్తితో పొడిచి చంపిన కేసులో నిందితుడిగా నిలిచాడు.
ఈ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది. ఫిర్యాదురాలైన తన తల్లి సాబెరా బేగంను కేసు రాజీ చేసుకోవాలని కొడుకు షాదుల్ కోరగా, ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన షాదుల్ ఫిబ్రవరి 25న మంగళవారం తన తల్లి తలపై రోకలి కర్రతో కొట్టగా, ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలి పెద్దకొడుకు అబ్దుల్ ఖాదర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాజు తెలిపారు.