calender_icon.png 16 January, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగి వస్తున్నాడని తండ్రిని హత్య చేసిన కుమారుడు

15-01-2025 10:58:02 PM

మేడ్చల్ (విజయక్రాంతి): ప్రతిరోజు తాగి వస్తున్నాడని తండ్రిని కుమారుడు హత్య చేసిన ఘటన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.... షామీర్పేట్ లోని పెద్దమ్మ కాలనీకి చెందిన అలకుంట్ల హనుమంతు (50) ప్రతిరోజు మద్యం తాగి ఇంటికి వస్తుండడంతో తాగవద్దని కుమారుడు నర్సింగరావు పలుమార్లు చెప్పాడు. అయినప్పటికీ తాగి వచ్చి గొడవ చేస్తుండడంతో కుమారుడు క్షణికావేశంలో రోకలిబండతో తలపై బాధడంతో అక్కడికక్కడే మరణించాడు. షామీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.