నిజామాబాద్ (విజయక్రాంతి): ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని మూడో టౌన్ పరిధికి చెందిన శ్రీరాం రమేశ్‌కు గత ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. భార్యభర్తల మధ్య చిన్న చిన్న విషయాలతో గొడవ పడేవారు. మనస్థాపన చెందిన శ్రీరామ రమేష్ భార్య పుట్టింటికి వెళ్ళింది. గురువారం సుభాష్‌నగర్‌లోని భార్య పుట్టింటికి వెళ్లి రమేష్ కిటికీలో నుంచి పెట్రోల్ పోసి నిప్పటించాడు, అదృష్టవశాత్తు ఎవరికీ హానీ జరగలేదు. రమేశ్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు.