రాష్ట్రవ్యాప్తంగా మరీ ముఖ్యంగా పట్టణాలు, నగరాలలో అయి తే రోజురోజుకూ యాచక వృత్తిలోకి వచ్చేవారి సంఖ్య పెరిగిపోతున్నది. అన్ని అవయవాలు సహా మెదడుకూడా సక్రమంగా ఉన్నవా రు సైతం భిక్షాటనలోకి వస్తుండడం ఆశ్చర్యకరం. చాలామంది ఈ ఏ కారణం వల్ల ఇలా యాచకుల అవతారం ఎత్తుతున్నారో తెలియడం లేదు. అనునిత్యం వివిధ ప్రధాన కూడళ్లలో, హోటళ్లు, గుళ్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలలో అనేకమంది భిక్షాటనతో గడుపుతున్నారు.
వీళ్లలో చాలామంది ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేవరకు వెంటపడుతూ అదే పనిగా విసిగిస్తున్న ఉదంతాలు ఎన్నో. ఇలాంటి వారిపై పోలీసు శాఖ, ఇతర అధికారులు ప్రత్యేక నిఘా పెట్టవలసి ఉంది. సర్వాంగాలు సక్రమంగా వున్నవారికి ఈ వృత్తిలోకి రావలసిన అవసరమేమిటి? యాచకులు అందరికీ సంబంధిత అధికారులు సరైన కౌన్సెలింగ్ ఇవ్వాలి.