- అనుమతులు లేకున్నా తవ్వకాలు
- ప్రభుత్వ ఆదాయానికి గండి
- టిప్పర్ల వేగానికి అమాయకులు బలి
- చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం
పటాన్‌చెరు, జూలై 1౩ : ఉమ్మడి మెదక్ జిల్లాలో మట్టి మాఫియా చెలరేగుతున్నా అధికారులు పట్టించుకోవ డం లేదు. అనుమతులు లేకుండా త=వ్వకాలు జరిపి, తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండీ కొడుతున్న అక్రమార్కులపై చర్యలు శూన్యం. రాత్రివేళ అతివేగం, అజాగ్రత్తతో వెళ్లే టిప్పర్లు అమాయకులను ఢీకొట్టి మరణాలు సంభవిస్తున్నా తమకేమీ పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తుండడంపై పలు అనుమానాలకు తావిస్తున్నది.
అర్ధరాత్రి తవ్వకాలు, అక్రమ రవాణా
చెరువులో మట్టిని తవ్వాలన్నా, తరలించాలన్నా రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల నుంచి అనుమతులు తప్పనిసరి. కానీ డబ్బు సంపాదనే లక్ష్యంగా చేసుకున్న అక్రమార్కులు అధికారులనుంచి ఎలాంటి అనుమతు లు తీసుకోకుండా వనరులను కొల్లగొడుతున్నారు. రాత్రిపూట చెరువుల్లో మట్టి తవ్వకాలు జరిపి, టిప్పర్లలో ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. వాహ నాలకు వే బిల్లులు లేకున్నా దర్జాగా దందా ను సాగిస్తున్నారు. మట్టి తవ్వే ప్రదేశంతో పాటు వాహనాలు వెళ్లే మార్గం, ఇటుక బట్టీల వద్ద తమ మనుషులను ఏర్పాటు చేసుకొని దందాను కొనసాగిస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్, కౌడిపల్లి, హత్నూర మండలాల చెరువుల నుంచి నల్ల మట్టిని జిన్నారం మండలంలోని అన్నారం, గాగిల్లాపూర్ ఇటుక బట్టీలకు తరలిస్తున్నా రు. ఇదంతా తెలిసినా పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.
మట్టి టిప్పర్లు ఢీకొని అమాయకులు బలి
మట్టి టిప్పర్లను డ్రైవర్లు అతివేగం, అజాగ్రత్తతో నడుపుతూ అమాయకుల ప్రాణాల ను తీస్తున్నారు. ఈ నెల 4న గుమ్మడిదల టోల్‌గేట్ సమీపంలో రోడ్డు పక్కన ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పనులను పరిశీలిస్తున్న రైతు సరెడ్డి సంజీవరెడ్డిని టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గతేడాది అన్నారం సమీపంలోని ఇటుక బట్టీల వద్ద టిప్పర్ ఢీకొని ఒకరు మృతి చెందారు. ఇలాంటి ఘటనలు ఏటా జరుగుతూనే ఉ న్నా అధికారులు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు.
వాహనాలను అడ్డుకున్న ప్రజలు
ఇటీవల నర్సాపూర్ నుంచి అన్నా రం వైపు అతివేగంగా, అజాగ్రత్తతో వెళ్తున్న మట్టి టిప్పర్లను గుమ్మడిదల గ్రామస్థులు అడ్డుకున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యంతో అమాయ కులు ప్రాణాలు బలవుతున్నాయం టూ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే మట్టి వ్యాపారులు అక్కడికి చేరుకుని, వారిని బతిమిలాడడంతో వాహనాలను వదిలేశారు.