calender_icon.png 24 December, 2024 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాఫ్ట్‌వేర్ కంపెనీ భారీ మోసం

06-11-2024 12:46:18 AM

ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూలు

మాదాపూర్ పీఎస్‌లో బాధితుల ఫిర్యాదు

శేరిలింగంపల్లి, నవంబర్ 5: మాదాపూర్‌లోని కెరియర్ సాఫ్ట్‌వేర్ అనే కంపెనీ ట్రైనింగ్ అనంతరం ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి అందినకాడికి దోచుకొని తీరా ఉద్యోగాలు ఇప్పించకుండా భారీ మోసానికి పాల్పడింది. బాధితులు తెలిపిన వివరాలు.. మాదాపూర్‌లోని కెరియర్ పీడియా ఎడ్యుటెక్ లిమిటెడ్ కంపెనీ.. ట్రైనింగ్ అనంతరం సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఒక్కో విద్యార్థి నుంచి రూ.లక్ష నుంచి లక్షన్నర వరకూ వసూలు చేసింది. ఒక్కో బ్యాచ్‌లో 70 మంది స్టూడెంట్స్‌ని చేర్చుకున్న కంపెనీ నిర్వాహకులు ట్రైనింగ్ పేరుతో మొత్తం 3 బ్యాచులకు క్లాసులు నిర్వహించారు. డబ్బు లు లేనివారికి కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల భాగస్వామ్యంతో లోన్ ఇప్పించి డబ్బులు వసూలు చేసినట్లు విద్యార్థులు వాపోయారు. అయితే ఎంతకీ ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో సంబంధిత కంపెనీపై సోమవారం బాధితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.