11-02-2025 08:38:57 PM
కమాన్ పూర్ (విజయక్రాంతి): కమాన్ పూర్ మండలంలోని రొంపికుంట గ్రామానికి చెందిన కొయ్యడ రాజయ్య (53) అనే గొర్రెల కాపరి సోమవారం రాత్రి పాము కాటుకు గురై మృతి చెందాడు. రామగుండం మండలం లక్ష్మీపురం శివారులో గొర్లను మెపడం కోసం మంద ఏర్పాటు చేసుకున్నారు. మంద ఏర్పాటు చేసుకున్న పక్కన నేలపై గొర్ల కాపరి నిద్రిస్తున్న అతనిని పాము కాటు వేయడంతో గొర్రెల కాపరి అదే నిద్ర మత్తులో ప్రాణాలు వదిలాడు. అతని కుటుంబ సభ్యులు ఎన్.టీ.పీ.సీ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో మృతుని భౌతిక కాయానికి గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి భార్య స్వరూప, కుమారులు రమేష్, సంజీవ్ లు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.