calender_icon.png 12 February, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొర్రెల కాపరిని కాటేసిన పాము నిద్రలోనే మృతి

12-02-2025 01:47:22 AM

కమాన్‌పూర్, ఫిబ్రవరి 11: కమాన్ పూర్ మండలంలోని రొంపికుంట గ్రామానికి చెం దిన కొయ్యడ రాజయ్య (53) అనే గొర్రెల కాపరి సోమవారం రాత్రి పాము కాటుకు గురై మృతి చెందాడు.  రామగుండం మండ లం లక్ష్మీపురం శివారులో గొర్లను మెపడం కోసం మంద ఏర్పాటు చేసుకున్నారు.

మం ద ఏర్పాటు చేసుకున్న పక్కన నేలపై  గొర్ల కాపరి నిద్రిస్తున్న అతనిని పాము కాటు వే యడంతో గొర్రెల కాపరి అదే నిద్ర మత్తులో ప్రాణాలు వదిలాడు. అతని కుటుంబ సభ్యు లు ఎన్. టీ. పీ. సీ పోలీస్ స్టేషన్ లో పిర్యా దు చేయడంతో  మృతుని భౌతిక కాయాని కి  గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో పో స్టుమార్టం నిర్వహించారు. మృతుడికి భార్య స్వరూప, కుమాలు రమేష్, సంజీవ్‌లు ఉ న్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.