19-04-2025 02:01:38 AM
సుల్తానాబాద్, మార్చి 18 (విజయక్రాంతి) రైతుల ము ఖాల్లో చిరునవ్వే మాకు ఆశీర్వాదాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవారం మండలంలోని నారాయణరావుపల్లె, గొల్లపల్లి, సాంబయ్యపల్లి, ఐతరాజుపల్లి, భూపతిపూర్, గర్రెపల్లి, బొంతకుంటపల్లి, నరసయ్యపల్లి, నీరుకుల్ల, గట్టేపల్లి, కదంబాపూర్, తొగర్రాయి గ్రామాల్లో శుక్రవారం సింగిల్ విండో, ఐకెపి ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు కటింగ్ ల పేరిట రైతులను దోచుక తిన్నారని, సన్న వడ్లకు బోనస్ లో పెద్దపల్లి నియోజకవర్గం రాష్ట్రంలోనే టాప్ లో ఉందన్నారు.ఆరుగాలం కష్టపడి, చెమటోడ్చి పండించిన రైతుల కష్టార్జితాన్ని గత ప్రభుత్వంలో గద్దల్ల దూసుకు తిన్నారన్నారు.
నియోజకవర్గంలోనే అత్యధికంగా రూ. 59 కోట్ల 65 లక్షల రూపాయల బోనస్ ను రైతులు పొందారని, సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణానికి రూ.1.52 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాల య సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ లు సిరిగిరి శ్రీనివాస్,సందీప్ రావు, వినమల్ల రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి మహేందర్, మండల పార్టీ అధ్యక్షుడు చిలుక సతీష్, డిపిఎం నాగేశ్వర్ రావు, ఏపిఎం లు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.