calender_icon.png 13 January, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రహం నుంచి కుళ్లిన గుడ్ల వాసన

10-07-2024 12:05:00 AM

  • బయటపెట్టిన కొత్త పరిశోధన 
  • అక్కడ మీద ఉష్ణోగ్రతలు అధికం 
  • హెచ్‌డీ 189733 బీ గ్రహంగా గుర్తింపు

న్యూఢిల్లీ, జూలై 9: ఒక గ్రహం నుంచి కుళ్లిపోయిన కోడిగుడ్ల వాసన వస్తోందని కొత్త అధ్యయనంలో వెల్లడైంది. శాస్త్రవేత్తలు హెచ్‌డీ 189733 బీ అనే గ్రహంపై పరిస్థితులను స్టడీ చేయగా.. అక్కడ అధిక ఉష్ణోగ్రతలు ఉన్నట్లు తెలిసింది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను ఉపయోగించి పరిశీలించారు.

అధికంగా ఆ వాయువు.. 

ఈ గ్రహం మీద హైడ్రోజన్ సల్ఫైడ్ అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గురు గ్రహం మీద కూడా దీని ఆనవాళ్లను ఇదివరకే గుర్తించారు. ఈ గ్రహం మీద కుళ్లిన కోడిగుడ్ల వాసన రావడానికి ఇదే కారణం అని శాస్త్రవేత్తలు తెలిపారు. సోలార్ వ్యవస్థ అవతల హైడ్రోజన్ సల్ఫైడ్‌ను గుర్తించడం ఇదే మొదటిసారి.

అక్కడ మీ ముక్కు పని చేస్తే.. 

ఒక వేళ మీ ముక్కు 1000 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా పని చేస్తే అప్పుడు మీకు ఈ గ్రహం ను ంచి కుళ్లిన కోడిగుడ్ల వాసన వస్తుందని శాస్త్రవేత్త డాక్టర్ గంగ్వూయి తెలిపారు. జాన్ హాప్‌కిన్స్‌లో ఖగోళ శాస్త్రవేత్త గంగ్వూయి పరిశోధనకు నేతృత్వం వహించారు. అక్కడ ఏలియన్స్ ఉన్నాయని ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు సూచిస్తుందని వారు పేర్కొన్నారు. గురు గ్రహం మీద ఈ వాయువున్నా అక్కడ ఉన్న వేడి వాతావరణం వల్ల జీవం బతకడం అసాధ్యం. ఇక్కడ కూడా అధిక ఉష్ణోగ్రతలు, హైడ్రోజన్ సల్ఫైడ్ అధిక మోతాదులో ఉండడంతో ఏలి యన్స్‌కు సంబంధించి పరిశోధనలు చేయడం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.