22-04-2025 12:19:36 AM
సూర్యాపేట, ఏప్రిల్ 21(విజయక్రాంతి): ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ విధానాన్ని తొలగించి పాత పద్ధతి ద్వారానే రిజిస్ట్రెషన్లు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూర్యాపేట దస్తావేజు సంఘం అధ్యక్షులు తన్వీర్ హుస్సేన్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో ధర్నా నిర్వహించి మాట్లాడారు.
గత ప్రభుత్వంలో స్లాట్ బుక్ విధానాన్ని రద్దు చేసిందని మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధానాన్ని అమలు చేయడం వలన కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. స్లాట్ విధానంతో రానున్న రోజుల్లో డాక్యుమెంట్ రైటర్స్ జీవన ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో వినియోగదారులు నష్టపోయే అవకాశం ఉందన్నారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మా బాధలు పట్టించుకోవాలని తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానానికి వ్యతిరేకంగా దస్తావేజులేఖర్లు పెన్ డౌన్ బంద్ పాటించడం జరుగుతుందన్నారు. అనంతరం సబ్ రిజిష్ట్రార్ గుడుగుంట్ల అంబేద్కర్ కు వినతి పత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు ఆకునూరి మురళీ మనోహర్ రావు, కందిమల్ల మధుసూదన్, గౌరవ సలహాదారులు ఎండి గౌస్ ఖాన్, రవీందర్ రావు, గట్టు మహేందర్, వీర్లపాటి వెంకన్న, మారోజు విక్రమ్ కుమార్, చెరుకు శ్రీనివాస్, కొల్లూరు సోమయ్య, వినయ్ కుమార్, నజీర్, పసుపులేటి సతీష్, రజినీకాంత్, సాయి, విక్రమ్, నజీర్ బాషా, ఉపేంద్రాచారి, జానయ్య, ప్రతాప్, ఉపేందర్, వెంకన్న, చైతన్య, సందీప్, నరేష్, హరీష్, మహేష్, ఉమారాణి, మదీన, వర్రే శివ తదితరులు పాల్గొన్నారు.