calender_icon.png 3 April, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

02-04-2025 12:15:39 AM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజ్

హనుమకొండ, ఏప్రిల్ 1 (విజయ క్రాంతి): హనుమకొండ హంటర్ రోడ్డు లోని కోడెం కన్వెన్షన్ హాల్ నందు ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిదన్ వర్ధన్నపేట నియోజకవర్గ విస్తృతస్థాయి సన్నాహక సమావేశాన్ని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ  అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, టెస్కాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ స్వాతంత్రం తెచ్చిన నాడు బిజెపి పార్టీ ఏడ ఉన్నది. అంబేద్కర్ గారిని  నిండు పార్లమెంటులో అమిత్‌షా అవమానపరిచిండు.

ఓటు హక్కు కల్పించి సమానత్వాన్ని కల్పించిన అంబేద్కర్ మాకు దేవుడు, అంబేద్కర్ పై అమిత్ షా అహంకార పూరిత వ్యాఖ్యలు ఆపాలి. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల న్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.