21-04-2025 12:40:12 AM
మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 20 (విజయక్రాంతి) మహాత్మా గాంధీ, అంబేద్కర్ ను గౌరవించుకుంటూ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ ను జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠామకంగా తీసుకున్న గొప్ప కార్యక్రమమ ని, ఈ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎక్సైజ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.
ఆదివారం కొల్లాపూర్ లోని క్యాంప్ కార్యాలయంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&, నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోన్ని ప్రతి గ్రామంలో పాదయాత్రలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఈ కార్యక్రమంలో కలిసి కట్టుగా విచ్చేసి కార్యాచరణలో భాగస్వామ్యం కావాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు, స్వా తంత్రం వచ్చిన తరువాత దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలన్నారు.
దేశంలో బిజెపి ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానిస్తూ కించపరుస్తూ వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తూ, ఆప్రజస్వామిక నిర్ణయాలు తీసుకుంటున్న బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని దిశా నిర్దేశం చేశారు.
నియోజక వర్గ అభివృద్ధి నిధుల నుండి రూ. 2 కోట్లను గ్రంథాలయాలు, క్రీడల అభివృద్ధికి కేటాయించనున్నట్లు మంత్రి తెలిపా రు. ప్రతీ గ్రామనీకి లక్ష రూపాయల చొప్పు న గ్రంథాలయాల అభివృద్ధికి మొత్తం రూ. 1 కోటి, అదే విధంగా ప్రతీ గ్రామానికి లక్ష రూపాయల క్రీడల అభివృద్ధికి మొత్తం రూ. 1 కోటి కేటాయించనున్నట్లు తెలిపారు.
మహాత్మా గాంధీ, డా.బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రి ఫూలే వంటి మహానుభావుల జీవిత చరిత్ర, వారి ఆశయాలు, సిద్ధాంతాలు వారు సాధించిన విజయాలను తెలిపే పుస్తకాలను గ్రంథాలయాలలో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.