calender_icon.png 21 April, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకాశమే హద్దు!

20-04-2025 12:00:00 AM

అంతరిక్షరంగంలో మనం కొత్త అధ్యయనాన్ని లిఖించబోతున్నాం. భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టబోతున్నారు. దీనిద్వారా భారత్‌నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొట్టమొదటి వ్య క్తిగా శుక్లాకు గుర్తింపు దక్కుతుంది. సుమారు నలభై ఏళ్ల క్రితం భారత్‌కు చెందిన రాకేశ్ శర్మ సోవియట్ సోయజ్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా రోదసీలోకి వెళ్లారు.

అయితే, అప్పటికి ఐఎస్‌ఎస్ ని ర్మాణం జరగలేదు. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం పనితీరుపై సమీక్ష సందర్భంగా వచ్చే నెలలో శుభాన్షు శుక్లా అక్కడికి వెళ్తున్నట్టు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ శుక్రవారం ప్రకటించారు. భారత్ అంతరిక్షరంగంలో అభివృద్ధి వైపు శరవేగంగా దూసుకుపోతున్నది. ఇందు లో భాగంగానే ఇస్రో మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్‌యాన్’ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నది.

ఇందుకోసం నలు గురిని ఎంపిక చేసి, వారికి శిక్షణ కూడా ఇప్పిస్తున్నది. గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం ఇస్రో ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల్లో శుభాన్షు శుక్లా ఒకరు. 1985 అక్టోబర్ 10న లక్నోలో జన్మించిన శుక్లా.. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో విద్యాభ్యాసం చేసి, భారత వైమానిక దళంలో చేరారు. సు ఖోయ్ ఎంకేఐ, మిగ్ వంటి యుద్ధవిమానాలు నడిపిన అ నుభవం ఆయనకు ఉంది.

అయితే, గగనయాన్ ప్రాజెక్ట్‌కు ముందే అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధనల సంస్థ ‘యాక్సి యం స్పేస్’ చేపట్టిన ఏక్స్ మిషన్‌లో భాగంగా శుక్లా ఐఎస్‌ఎస్‌కు వెళ్తున్నారు. శుక్లాతోపాటు పోలాండ్‌కు చెందిన సావోస్జ్ ఉజాన్‌స్కీ హంగేరీ వ్యోమగామి టిబోర్ కపు స్పేస్‌ఎక్స్ సంస్థకు చెం దిన డ్రాగన్ వ్యోమనౌకలో ఐఎస్‌ఎస్‌కు పయనమవుతారు. నాసా మాజీ వ్యోమగామి పిగ్గీ వెట్సన్ కమాండర్‌గా ఉండే  ఈ మిషన్‌లో శుక్లా పైలట్‌గా వ్యవహరిస్తారు.

అంతరిక్ష యాత్రకు సంబంధించిన కా ర్యకలాపాలు, ప్రయోగ విధానాలు, భార రహిత స్థితికి అలవాటు పడ టం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా సన్నద్ధం కావాలనే విషయాల్లో శు క్లా తర్ఫీదు పొందేందుకు ఈ మిషన్ ఉపకరిస్తుంది. ఈ విషయాన్ని కొంచెం పక్కన పెడితే, అంతరిక్షంలో భారత్‌కు అంటూ సొంతంగా ‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్’ పేరుతో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఇస్రో సిద్ధమవుతోంది.

ఈ ఏడాది మొదట్లో ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ ప్రయోగం ఇందులో భాగమే. స్పేడెక్స్ ప్రయోగం ద్వారా రోదసిలో రెండు ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా డాకింగ్ అన్‌డాకింగ్ చేసింది. దీనిద్వారా రోదసీలో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సాంకేతికత భారత్‌కు లభించినట్లయింది.

ఈ ఉత్సాహంతో 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రా న్ని ఏర్పాటు చేయడానికి ఇస్రో ప్రయత్నాల్లో మరింత వేగం పెంచి ంది. ఇక శుభాన్షు శుక్లా విషయానికి వస్తే ఆయన ఇతర దేశానికి సం బంధించిన మిషన్‌లో భాగంగానే అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్నారు. అ యినప్పటికీ ఒక భారతీయుడు అంతరిక్ష కేంద్రానికి వెళ్తుండటమనేది మనందరం గర్వించదగ్గ విషయం.