calender_icon.png 16 November, 2024 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకాశమే హద్దుగా

16-11-2024 02:43:52 AM

  1. శతకాలతో చెలరేగిన సామ్సన్, తిలక్ 
  2. సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం

23 మ్యాచ్‌లో భారత్ కొట్టిన సిక్సర్ల సంఖ్య. టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధికం.

210 సామ్సన్, తిలక్ వర్మ జోడించిన పరుగులు. టీ20ల్లో భారత్ తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం.

* అది మాటలకందని విధ్వంసం.. ఊహలకందని ఊచకోత. బంతి పడిందే ఆలస్యం కసితీరా బౌండరీలు, సిక్సర్లతో వాండరర్స్ హోరెత్తిపోయింది. శాంసన్ క్లాస్ సెంచరీకి జతగా తిలక్ ఊర మాస్ శతకం తోడవ్వడంతో టీ20 చరిత్రలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో మ్యాచ్‌తో పాటు సిరీస్ టీమిండియా వశమైంది.

జోహన్నెస్‌బర్గ్:  వాండరర్స్ స్టే డియం మోతెక్కిపోయింది. బౌండరీల వర్షం.. సిక్సర్ల సునామీతో స్టేడి యం తడిసి ముద్దయింది. శాంసన్, తిలక్ వర్మలు పోటీపడి సెంచరీలు సాధించిన వేళ నాలుగో టీ20లో సౌతాఫ్రికాపై టీమిండియా 135 ప రుగుల తేడాతో విజయా న్ని అందుకుంది.

తొలుత బ్యా టింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. తిలక్ (120 నాటౌట్), సం జూ (109 నాటౌట్) శతకాలతో విధ్వంసం సృష్టించారు. సఫారీ బౌలర్లలో సిపామ్లా ఒక వికెట్ తీశాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 3 వికెట్లు తీయగా.. వరుణ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

దంచుడే దంచుడు

బ్యాటర్లకు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్‌పై ఓపెనర్లు సంజూ సామ్స న్, అభిషేక్ శర్మ శుభారంభం అందించారు.  క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మతో కలిసి సామ్సన్ విధ్వంసకాండ సాగించాడు. సఫారీ బౌలర్లపై ఈ ఇద్ద రు నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. బంతి పడిందే ఆలస్యం అన్నట్లు సిక్సర్లు, బౌండరీలతో హోరెత్తించారు.

ఈ క్రమంలో సామ్సన్ 51 బం తుల్లో శతకం అందుకోగా.. తిలక్ కేవలం 41 బంతుల్లోనే సెంచరీ మార్క్ సాధించాడు. అనంతరం సౌతాఫ్రికా ఆరంభంలోనే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే మిడిలార్డర్‌లో స్టబ్స్, మిల్లర్ ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా రన్‌రేట్ పెరిగిపోవడంతో సఫారీ జట్టు ఓటమి చవిచూసింది.

సంక్షిప్తస్కోర్లు: 

భారత్: 20 ఓవర్లలో 283/1 (తిలక్ 120 నాటౌట్, సా మ్సన్ 109 నాటౌట్; సిపామ్లా 1/58)

సౌతాఫ్రికా: 18.2 ఓవర్లలో 148 ఆలౌట్ (స్టబ్స్ 43, మిల్లర్ 36; అర్ష్‌దీప్ 3/20).