19-04-2025 05:18:17 PM
కల్తీకల్లు నివారణపై వేసిన పోస్టర్ లా పరిస్థితి ఇది..
కామారెడ్డి (విజయక్రాంతి): కల్తీకల్లు, డ్రగ్స్ నివారించడానికి ప్రభుత్వం ఒకవైపు కృషి చేస్తుంటే కల్లుమూస్తే దారులు మాత్రం అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేటలో కల్తీకల్లు నివారణ కమిటీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల నేతృత్వంలో కల్తీకల్లు సేవిస్తే జరిగే అనర్థాల గురించి గ్రామీణ, పట్టణ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రభుత్వం వాల్ పోస్టర్లను ప్రతి గ్రామంలో పట్నంలో వాడవాడల గోడలపై అతికించారు.
కల్లు దుకాణాల సమీపంలో గోడలకు సైతం అంటించారు. కామారెడ్డి జిల్లా రాజంపేటలో కల్లు దుకాణం దగ్గర గోడకు పోస్టరులను గ్రామ మహిళా సమాఖ్య ఐకెపి సిబ్బందితో కలిసి ఎంతో ఆర్భాటంగా కల్తీ కల్లు నివారణపై పోస్టర్లను అతికించారు. అతికించిన గంటలోపే పోస్టర్లను చించి వేశారని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం ఒకవైపు ప్రచారం చేస్తుంటే మరోవైపు కల్లు మూస్తే దారులు ప్రచార పోస్టరులను తొలగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇలా చేస్తే ప్రభుత్వ ఆశయం ఏ మేరకు సఫలీకృతం అవుతుందోనని అంటున్నారు. కల్లుమూస్తే దారులు తొలగించారా లేక వారికి పడని వారు తొలగించారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గ్రామస్తులు మాత్రం కళ్ళు మూస్తే దార్ల పని అయి ఉంటుందని ఆరోపిస్తున్నారు.