calender_icon.png 26 April, 2025 | 3:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగిల్ వచ్చేది అప్పుడే

26-04-2025 12:00:00 AM

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘సింగిల్’. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. గీతాఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విద్యా కొప్పినీడి, భానుప్రతాప, రియాజ్ చౌదరి నిర్మాతలు. కేతికాశర్మ, ఇవానా ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన హిస్టారిక్ డేట్ అనౌన్స్‌మెంట్ వీడియో ఆకట్టుకుంటోంది. హీరో శ్రీవిష్ణు మే 9న రిలీజైన కల్ట్ సూపర్‌హిట్ సినిమాల గురించి చెప్తుండగా.. చివరలో ఈ చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్ ‘జైలర్ హుకుం’ స్టుల్‌లో మే 9న రిలీజ్ డేట్‌ను లాక్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్ వేల్ రాజ్; సంగీతం: విశాల్ చంద్రశేఖర్; ఎడిటర్: ప్రవీణ్ కేఎల్; ఆర్ట్: చంద్రిక గొర్రెపాటి.