చెంపలు వేసుకుని రుణమాఫీ చేయాలి
మాజీ మంత్రి హరీశ్‌రావు
సిరిసిల్ల, నవంబర్ 12 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తానని రాజన్న మీద ఒట్టు వేసి మాట తప్పాడని, పాలకుడే పాపం చేస్తే రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం చేసిన పాపం రాష్ట్ర ప్రజలకు శాపం కావొద్దని దేవున్ని మొక్కుతున్నాని చెప్పారు. మంగళవారం వేములవాడ రాజన్నను దర్శించుకున్న అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతు న్నారన్నారు.
వడ్లకు బోనస్ ఇచ్చామని మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తూ అక్కడి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. రైతుబంధును యా సంగి పంటకు అయినా ఇచ్చేలా చూడాలని దేవున్ని వేడుకున్నానని చెప్పారు. కేసీఆర్‌పై మాట్లాడే హక్కు రేవంత్‌రెడ్డికి లేదన్నారు. గత ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఆయ న వెంట వేములవాడ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మినర్సింహరావు, దేవి ప్రసాద్, తుల ఉమ, మనోహర్‌రెడ్డి ఉన్నారు.