26-04-2025 12:58:58 AM
నాగారం: ఏప్రిల్ 25: 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని నాగారం బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య అన్నారు.నాగారం మండలం నాగారం బంగ్లా గ్రామంలోని బీఆర్‌ఎస్ మండల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్ అని,పార్టీ ఆవిర్భావం సందర్భంగా ప్రతి గ్రామంలో గులాబీ జెండాను ఎగురవేసి 27న జరిగే ఎల్కతుర్తి సభకు రావాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ త్యాగం మరువలేనిదని ఆయన పదేండ్ల పాలనలో అభివృద్ధి,సంక్షేమంలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారని అన్నారు.
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుంటే ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గుండగాని అంబయ్య ఈదుల కిరణ్, దోమల బాలమల్లు పొదిలి రమేష్ చంద్రమౌళి అంజయ్య లింగయ్య మల్లేష్ యాదగిరి మహేందర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.