calender_icon.png 21 April, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

21-04-2025 01:24:24 AM

భోలక్‌పూర్ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు వై శ్రీనివాసరావు

ముషీరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): వరంగల్లో ఈనెల 27వ తేదీన జరిగే బిఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంత చేయాలని భోలక్ పూర్ డివిజన్ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాసరావు  అన్నారు. ఈ మేరకు ఆదివారం భోలక్పూర్ డివిజన్‌లో ని ఎస్బిఐ కాలనీలో డివిజన్ బిఆర్‌ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సార్ సారాధ్యంలో  భోలక్పూర్ నుంచి 500 మందికి పైగా కార్లు, బస్సుల లో ర్యాలీగా తరలి వెళ్లాలని కోరారు. జెండాలు, బ్యానర్లు తోరణాలతో  భోలక్‌పూర్‌ను గులాబీమయం చేయాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో భోలక్ పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ పరిశీలకుడు దీన్ దయాల్ రెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బింగి నవీన్, భోలక్పూర్ డివిజన్ ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, డివిజన్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అలీ, బిసి సెల్ అధ్యక్షుడు ఉమాకాంత్ ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకులు మనవర్ చాంద్,  చాంద్ పాషా, జబ్బర్, కృష్ణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.