calender_icon.png 21 April, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

21-04-2025 01:20:15 AM

చెన్నూరు ఇన్చార్జి డా రాజా రమేష్ 

మందమర్రి, ఏప్రిల్ 20 : ఈనెల 27న వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరుగనున్న బిఆర్‌ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని చెన్నూరు నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఇన్చార్జి డా రాజా రమేష్ కోరారు. మండలం లోని అందుగులపేటలో సందర్భంగా ఆదివారం చలో వరంగల్  కరపత్రాలను  విడుదల చేసిగోడ ప్రతులనులను అంటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభు త్వం ఆరుగ్యారెంటీలు, ఆనేక హామీలతో అధికారం చేపట్టి 18 నెలలు గడిచినప్పటికి గ్యారంటీలు, హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు.

రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరిట ప్రచారం చేసుకుంటున్నప్పటికి ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభు త్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నివసిస్తూ టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆం దోళన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు ఈ మహాసభల్లో భవిష్యత్ ఆందోళన కార్యక్రమాల కార్యాచరణ రూ పొందించడం జరుగుతుందని ప్రతి గులాబీ కార్యకర్త ఈనెల 27న వరంగల్ లో జరిగే బిఆర్‌ఎస్ రజతోత్స వ సభలో పాల్గొని విజయ వంతం చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బడికల సంపత్ , మాజీ వైస్ ఎంపీపీ లౌడం రాజ్ కుమార్, మండల మహిళా అధ్యక్షురాలు మేకల పుష్పలత, నాయకులు జె. గౌతమ్, చిప్పకుర్తి అఖిల్ , శ్రీనివాస్, మహేష్, ప్రవీణ్, సాయి, సోషల్  మీడియా నాయకులు పాల్గొన్నారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో..

బీఆర్‌ఎస్ రథోత్సవ వేడుకల సందర్భం గా ఆదివారం జిల్లావ్యాప్తంగా గులాబీ శ్రేణు లు జెండా పండుగను ఘనంగా జరుపుకున్నారు.రజతోత్సవ సభ వాల్ పోస్టర్స్ ఆవిష్కరించారు. వాంకిడి మండల కేంద్రం లో మాజీ జెడ్పిటిసి అజయ్ కుమార్ గులా బీ జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ పార్టీ 25 సంవత్సరాల పండుగను విజయవంతం చేసేందుకు ప్రతి గ్రామం నుండి పార్టీ శ్రేణు లు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.