21-04-2025 12:47:42 AM
బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్
చిట్యాల, ఏప్రిల్ 20(విజయ క్రాంతి):వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్ ఆదివారం పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ప్రయోజనాల కోసమే కేసీఆర్ పార్టీని స్థాపించారని తెలిపారు. నాటి నుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిషలు పాటు పడుతున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర సాధన కోసం పదువులను లెక్కచేయలేదని, చావుదాకా వెళ్లి తెలంగాణను సాధించినట్లు గుర్తు చేశారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్నిరంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. రజతోత్సవ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేసి సభకు బయలుదేరాలని ఆయన కోరారు.