calender_icon.png 20 April, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

19-04-2025 09:01:50 PM

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..

దౌల్తాబాద్ (విజయక్రాంతి): బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ సభను విజయవంతం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాయపోల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ అని, రాష్ట్రం సాధించుకోవడంతో పాటు అభివృద్ధిలో తెలంగాణను దేశానికే మోడల్ గా నిలిపిన ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు. 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు విసిగిపోయారని కాంగ్రెస్ మోసాలు అరాచకాలకు ప్రజల స్వస్తి పలికే సమయం వచ్చిందన్నారు.

బీఆర్ఎస్ 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ వేడుకలకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం బీఆర్ఎస్ యువజన నాయకుడు ఉప్పల భార్గవ్ నానమ్మ బాలమ్మ మరణించడంతో కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, మండల ఉపాధ్యక్షులు వెంకట్ గౌడ్, మాజీ జెడ్పిటిసి యాదగిరి, రాష్ట్ర యువజన విభాగం నాయకులు రాజిరెడ్డి, మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు పర్వేజ్, నాయకులు ఇప్ప దయాకర్ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.