19-03-2025 12:00:00 AM
వినయ్‌కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కాలమేగా కరిగింది’. ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. శింగర మోహన్ దర్శకత్వంలో పొయెటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భం గా మార్చి 21న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫీల్‌గుడ్‌లవ్ సాంగ్ ‘దరీ దాటిన మోహం’ను మేకర్స్ మంగళవారం రిలీజ్ చేశారు. ‘దరీ దాటిన మోహం దేహమే కదా.. ఎదుటే నిలిచేనూ, ఆ యదపై తాకేనూ.. చెలీ వీడినా మౌనం మర్మమే కదా.. కథలై కదిలేనూ, ఆ కబురై పాకేనూ..’ అంటూ లవ్ ఫీల్‌తో సాగుతుందీ పాట.
ఈ గీత సాహిత్యాన్ని చిత్ర దర్శకుడు శింగర మోహన్ రాయడం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్ స్వరాలు సమకూర్చగా సాయిమాధవ్, ఐశ్వర్య దరూరి పాడారు. ఈ చిత్రానికి డీవోపీ: వినీత్ పబ్బతి; ఎడిటర్: రా యోగేశ్.