25-03-2025 08:13:34 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన కిషోర్ కుమార్ రెండు నెలల క్రితం చరవాణి పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సిఈఐఆర్ ద్వారా కిషోర్ చరవాణి పట్టుకొని మంగళవారం బాధితుడికి దోమకొండ ఎస్సై స్రవంతి చరవాణి అందజేశారు. ఎవరైనా చరవాణి పోగొట్టుకున్నట్లయితే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు.