18-02-2025 01:27:47 AM
* 46రోజులు.. 19.72లక్షల మంది సందర్శకులు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 17(విజయక్రాంతి): ఈ ఏడాది జనవరి 3 నుంచి ప్రారంభమైన 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ 2025, నుమాయిష్ ముగింపు వేడుకలు సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని గాంధీ సెంటినరీ భవన్‌లో జరిగాయి. 46రోజుల పాటు జరిగిన ఈ ఎగ్జిబిషన్‌కు రికార్డు స్థాయిలో 19.72లక్షల మంది సందర్శకులు వచ్చారు. దాదాపు 2వేల స్టాళ్లలో వస్తువులు, దుస్తులు, గృహోపకరణాలు తదితర సామాగ్రిని ప్రజలు కొనుగోలు చేశారు.