* ముగ్గురి అరెస్ట్.. రూ.28.26 లక్షలు స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ఓ షాప్ తాళం పగులగొట్టి చోరికి పాల్పడ్డ ముగ్గురిని సికింద్రాబాద్ మ పోలీసులు సోమవారం అరెస్ట్ చే వారి నుంచి రూ.28.26 లక్షల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మహంకాళి పీఎస్‌లో సీఐ పరశురామ్‌తో కలిసి ఏసీపీ సర్దార్ సింగ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
బీహార్‌కు చెందిన బట్టల వ్యాపారి మురళీధర్ మోహన్‌లాల్, యూపీకి చెందిన చంద్రబాన్ పటే ఉదయ్‌రాజ్‌సింగ్ కలిసి లాక్‌డౌన్‌కు ముందు వరకు సికింద్రాబాద్‌లో బట్టల వ్యాపారం చేసేవారు. ఆ తర్వా వీరి వ్యాపారం మూతపడింది. దీంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఈక్రమంలో సులభంగా డబ్బు సంపాదిం చోరీలు ఒకటే మార్గమని చంద్రబాన్ పటేల్, ఉదయ్‌రాజ్ సింగ్‌లను మురళీధర్ హోహన్‌లాల్ ప్రేరేపించాడు.
దీంతో ముగ్గురు కలిసి రాత్రి సమయాల్లో తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇండ్లు, షాపుల షెట్టర్లు తొలగించి వాటిల్లో డబ్బులు దొంగిలించాలని పథకం వేసుకున్నారు. రాత్రి సమయాల్లో షాపుల షెట్లర్లు తొలగించి లాక దాచిన డబ్బులు దొం ఇదే క్రమంలో గతనెల సికింద్రా వ వీరు సితారా లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు.
గత నెల 31న సికింద్రాబాద్ ఓల్డ్ బోయిగూడ ప్రాంతంలో ఉన్న డీప్ ఇం కంపెనీకి వెళ్లారు. ఆ భవనం షెటర్లు తొలగించి లాకర్‌ను పగుల గొట్టి అందులో ఉన్న రూ.30.20 లక్షల నగదుతో పరారయ్యారు. సదరు కంపెనీ యా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మహంకాళీ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా వారు సికింద్రాబాద్ సితారా లాడ్జ్‌లో ఉన్నట్లు గుర్తించి అదపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు.