calender_icon.png 12 February, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ యాక్షన్ సన్నివేశంతో షూటింగ్ ప్రారంభిస్తారట..

12-02-2025 12:47:28 AM

ఎన్టీఆర్‌ప్రశాంత్ నీల్ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. జనవరిలోనే వీరిద్దరి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని టాక్ నడిచింది. అయితే ఇంతవరకూ అతీగతీ లేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

అసలు ఎన్టీఆర్ ‘వార్ 2’ షూటింగ్‌ను ముగించుకున్నాడా? లేదా? అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం ఈ నెల 17 నుంచి ఎన్టీఆర్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందట. ఈ మూవీ షూటింగ్ కర్ణాటకలో ప్రారంభమవుతుందట. తొలి షెడ్యూల్ నే భారీ యాక్షన్ సన్నివేశంతో ప్రారంభించాలని నీల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోందని సమాచారం. ఈ సినిమా కూడా ‘సలార్’ మాదిరిగానే ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తీయనున్నారట . ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏడాది చివరి నాటికి ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.