calender_icon.png 18 November, 2024 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాజాలో కాల్పులు ఆగాలి

28-07-2024 12:05:00 AM

దాదాపు తొమ్మిది నెలల నుంచి గాజా అట్టుడుకుతున్నది. హమాస్ అంతానికే ఇజ్రాయెల్ కట్టుబడి ఉంది. కాల్పులవల్ల శాంతి రాదని, హమాస్‌ను ఓడించేందుకు పాలస్తానీయులను మట్టుపెట్టరాదని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా దేశాలు అభిప్రాయపడ్డాయి. ఈ మూడు దేశాలు కాల్పులను ఖండించాయి. ఇజ్రాయెల్ మానవత్వాన్ని పాటించాలని డిమాండ్ చేశాయి. ఈ దేశాలు మరో అడుగు ముందుకు వేసి పాలస్తానీయుల భూబాగాన్ని ఆక్రమించడం, అక్కడ కాల్పులు జరపటం, ఫలితంగా అమాయకులు ప్రాణాలు పోగొట్టుకోవడంతో తీవ్ర ఆందోళన చెందాయి.

ఇదే విషయాన్ని అంతర్జాతీయ న్యాయస్థానమూ స్పష్టీకరించింది. కనీసం కోర్టు మాటైనా విని ఇజ్రాయెల్ కాల్పులు నిలిపి వేస్తే గౌరవంగా ఉండాలి. అంతర్జాతీయ మానవ చట్టం కూడ ఇదే విషయాన్ని ఊటంకించింది. అయినా, ఇజ్రాయెల్ పట్టించు కోలేదు. కాల్పులు చేస్తూనే ఉంది. ఇప్పటికే గాజాలో భస్మీపటలమైన భవనాలు కుప్పలుగా ఉన్నాయి. నగరమంతా రోదనలతో నిండింది. శిథిలాల కింద తమ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని పలువురు వెతుకులాడటం గుండెలను పిండేస్తుంది.

రెండు ప్రాంతాలమధ్య సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించుకోవాలని, రెండు దేశాలకోసం కృషి చేయాలని, దీనిపై ఏమైనా ఇబ్బందులు ఉంటే తక్షణం అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకు పోవాలని కోరుతున్నారు. ఈ రకంగా అంతర్జాతీయ శాంతి, సహకారం కోసం వారు పాటు పడతారని, సఖ్యతకు కృషి చేస్తారని కోరుకుందాం.

కనుమ ఎల్లారెడ్డి