calender_icon.png 24 December, 2024 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడడుగులు వేసిన సింధు

24-12-2024 01:32:09 AM

* కనుల పండువగా కల్యాణం

* అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం

* నేడు హైదరాబాద్‌లో రిసెప్షన్

హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని సింధు పరిణయమాడింది. కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యారు. ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించే ఫొటో ను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఫొటో వైరల్‌గా మారింది. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన 

పీవీ సింధుకు అభిమానులంతా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. సింధు వివాహ బంధం పటిష్టంగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాడు. 

నేడే హైదరాబాద్‌లో.. 

ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివా హం చేసుకున్న సింధు నేడు హైదరాబాద్‌లో కుటుంబసభ్యులు, స్నేహితులు, తెలిసిన వారికి రిసెప్షన్ ఏర్పాటు చేసింది. సింధుతో పాటు తాను పెళ్లాడిన వరుడు వెంకట సాయిది కూడా హైదరాబాదే కావడం గమనార్హం. 

ఒక్క ఫొటో షేర్ చేయని సింధు..

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ షేర్ చేసిన ఫొటో తప్పిస్తే సింధు వివాహానికి సంబంధించి ఏ ఒక్క ఫొటో కూడా ఆన్లున్లో లేదు. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఏడడుగులు వేసిన సింధు, తర్వాత కూడా అభిమానులతో ఎటువంటి ఫొటోలు పంచుకోలేదు. నేడు హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేసినా కానీ సింధు ఒక్క ఫొటోను కూడా పంచుకోకపోవడం గమనార్హం. ఇప్పటికే ఎన్నో శిఖరాలను అధిరోహించిన సింధు పెళ్లితో నూతన అధ్యాయానికి నాంది పలికింది.