న్యూఢిల్లీ, నవంబర్ 6: కొత్త ఆర్డర్ల ఫలితంగా భారత్‌లో సేవల రంగం పర్చేజర్స్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) అక్టోబర్ నెలలో వృద్ధి జోరును ప్రదర్శించింది. బుధవారం విడుదలైన గణాంకాల ప్రకారం హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 58.5కు చేరింది. ఇది సెప్టెంబర్‌లో 57.7 శాతం. వాస్తవానికి పీఎంఐ ప్రమాణాల ప్రకారం 50 ఎగువన ఇండెక్స్ ఉంటే ఆ రంగం విస్తరిస్తున్నట్లు, 50 లోపు ఉంటే క్షీణిస్తున్నట్లు పరిగణిస్తారు. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో సర్వీసుల రంగం వృద్ధి పెరిగిందని తాజా పీఎంఐ ఇండెక్స్ వెల్లడిస్తున్నది.