calender_icon.png 1 April, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఉద్యోగులు చేసిన సేవలు గుర్తింపు తెస్తాయి..

29-03-2025 06:49:59 PM

ఉద్యోగి ఉద్యోగ జీవితంలో పదవి విరమణ అనేది సహజం..

సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖకు అంధించిన సేవలు మారువలేనివి..

సంగారెడ్డి (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీసులో చేసిన సేవలు ఎల్లప్పుడు గుర్తింపుగా ఉంటాయని, ఉద్యోగులు పదవీ విరమణ చేయడం సహజమని సంగారెడ్డి అదనపు ఎస్పి సంజీవరావు తెలిపారు. శనివారం సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో పదవి విరమణ పొందుతున్న ఎస్ఐలకు ఘనంగా సన్మానం చేసి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. గొల్ల రాములు, సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, 1983 లో జిల్లా పోలీసు శాఖలో పోలీస్ కానిస్టేబుల్ గా నియామకమై గడిచిన 42 సంవత్సరాలుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్ లలో సాధారణ విధులతో పాటు క్రైమ్ విధులను, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో విధులు నిర్వహించడం జరిగిందన్నారు. తనకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ సర్వీస్ మొత్తంలో ఏ చిన్న రిమార్క్ లేకుండా అంచలంచాలుగా పదోన్నతులు పొందుతూ.. సబ్-ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారని అన్నారు. 

ఖుర్షీద్ అలీ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, 1989 లో జిల్లా పోలీసు శాఖలో పోలీస్ కానిస్టేబుల్ గా నియామకమై గడిచిన 35 సంవత్సరాలుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్ లలో స్టేషన్ రైటర్ గా, సాధారణ విధులను, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో విధులు నిర్వహించడం జరిగింది. తనకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ, సర్వీస్ మొత్తంలో ఏ చిన్న రిమార్క్ లేకుండా అంచలంచాలుగా పదోన్నతులు పొందుతూ.. సబ్-ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారని అన్నారు. సంజీవయ్య, ఎఆర్.ఎస్ఐ, 1989 లో జిల్లా పోలీసు శాఖలో ఎఆర్ పోలీస్ కానిస్టేబుల్ గా నియామకమై గడిచిన 35 సంవత్సరాలుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో సాయుధ దళంలో సాధారణ విధులతో పాటు విఐపి పర్సనల్ సెక్యూరిటీ అధికారిగా పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ నందు ఇన్స్ పెక్టర్ గా, గ్రేహౌండ్స్ నందు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో విధులు నిర్వహించడం జరిగిందని చెప్పారు.

తనకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ.. అధికారుల మన్ననలు పొంది, సంజీవయ్య ఉత్తమ సేవలకు గాను రాష్ట్ర స్థాయిలో సేవ పతకాలను సైతం అందుకున్నాడు. సర్వీస్ మొత్తంలో ఏ చిన్న రిమార్క్ లేకుండా అంచలంచాలుగా పదోన్నతులు పొందుతూ.. ఎఆర్.ఎస్ఐ గా పదోన్నతి పొందారని అన్నారు. వారు పోలీసు శాఖకు అందించిన సేవలు మారువలేనివని వారి సేవలను కొనియాడారు. రిటైర్మెంట్ అనంతరం పోలీసు శాఖ నుండి రావలసిన అన్నిరకాల రిటైర్మెంట్ బెన్ఫిట్స్ సకాలంలో అందేవిధంగా చూస్తామన్నారు. రిటైర్మెంట్ అనంతరం కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మిగిలిన శేష జీవితం అతని కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను అన్నారు. పోలీస్ శాఖ తరపున అతనికి, అతని కుటుంబాలకు ఎల్లవేళలా సహాయ, సహకారం అందింస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ. కళ్యాణి, ఎఆర్. డియస్పీ నరేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఆర్.ఐ. రామరావ్, రిటైర్డ్ అవుతున్న అధికారుల కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.