calender_icon.png 2 April, 2025 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాంపల్లి పీహెచ్‌సీలో వైద్యసేవలు భేష్

22-03-2025 12:24:07 AM

నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం తనిఖీ

మునుగోడు, మార్చి 21 : నాంపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు భేష్గా ఉన్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి సిబ్బందిని అభినందించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్నిశుక్రవారం ఆమె తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, ఓపీ, ఈడీడీ, ఏఎన్సీ రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దవాఖానకు వచ్చిన ఇన్ పేషెంట్లతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఒకేరోజు 73 మంది ఔట్ పేషెంట్లకు వైద్య సేవలు అందించడంపై కలెక్టర్ వైద్యురాలు భవానిని అభినదించారు. పీహెచ్సీలో వైద్య పరీక్షల కోసం వస్తున్న సంక్షేమ హాస్టల్ విద్యార్థినుల ఆరోగ్యం, శిశు మరణాల సంఖ్యపై ఆరా తీశారు. పీహెచ్సీకి ఆటో క్లేవ్, ఫీటల్ డాప్లర్, సర్జికల్ పరికరాలు మంజూరు చేశారు. అనంతరం కలెక్టర్ స్థానిక కేజీబీవీలో వంటగది, డైనింగ్ హాల్, తరగతి గదులు, మధ్యాహ్న భోజనం పరిశీలించారు.