calender_icon.png 8 January, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వచ్ఛంద సంస్థల సేవలు అమోఘం

06-01-2025 08:10:49 PM

రికార్డ్ స్థాయిలో 790 కంటి ఆపరేషన్లు చేయించిన నిర్వాహకులను అభినందించిన కలెక్టర్..

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం మారుతి పారా మెడికల్ కాలేజీ ఆవరణలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో 790 కంటి ఆపరేషన్లు ఉచితంగా చేసిన పుష్పగిరి ఆసుపత్రి సికింద్రాబాద్ వారి సేవలు అమోఘమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్(Collector Jitesh V.Patil) అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కాలేజ్, లయన్స్ క్లబ్ భద్రాచలం వారి అధ్వర్యంలో ఎస్ఆర్ వాసవి అసోసియేషన్ యుఎస్ఎ. పుష్పగిరి కంటి ఆసుపత్రి సికింద్రాబాద్ వారి సహకారంతో మారుతి నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత నేత్ర శస్త్ర చికిత్స శిబిరం విజయవంతమైనది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంకు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ముఖ్యఅతిధిగా పాల్గొని స్వచ్ఛంద సంస్థల సేవలను సేవలను కొనియాడారు.

అంధత్వ నివారణ కొరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఈ కార్యక్రమానికి కావలసిన సహాయ సహకారాలు జిల్లా అధికార యంత్రాంగం నుండి అందిస్తామని తెలిపినారు. గిరిజన ప్రాంతంలో సికిల్సిల్ ఎనిమియా, తలసేమియా ఎక్కువగా ఉందని వాటి నివారణ కొరకు, చికిత్స కొరకు, సంక్షేమం కొరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సికిల్సెల్ ఎనిమియా, తలసేమియా వార్డును అభివృద్ధి పరుస్తామని, పుట్టుకతో రక్త హీనత కలిగిన పిల్లలకు ఆరోగ్యశ్రీ పథకం కింద చేపడతామని, రక్తదాన శిబిరాల నిర్వహణకు ప్రణాళిక చేపడతామని జిల్లా కలెక్టర్ తెలిపినారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్మన్  డాక్టర్ ఎస్.ఎల్.కాంతారావు మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ శ్రీజితేష్ వి. పాటిల్ జిల్లా కలెక్టర్ వారి అనుమతి ద్వారానే పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు ఈ కార్యక్రమమును నిర్వహించినారని, వారి పూర్తి సహకారం, సూచనలు ద్వారా శిబిరం విజయవంతం చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆపరేషన్లకు 19 బ్యాచిల ద్వారా 790 మందినీ, అలాగే మరో 1100 మందికి కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డి సి హెచ్ డా. రవిబాబు , డీఎంహెచ్వో డా. భాస్కర్ నాయక్, ఎంవిఐ వెంకట పుల్లయ్య ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ రామకృష్ణ, లయన్.జి. రాజారెడ్డి, లయన్ వై. సూర్యనారాయణ, చారుగుళ్ళ శ్రీనివాస్, డా.వై. భాను ప్రసాద్, డా. వి. కామేశ్వరరావు, జి.సంజీవరావు, ఎస్ఎన్వి రామారావు, డా. సంతోష్ లయన్ రామలింగేశ్వరరావు, డా. స్వామి, లయన్. ఎ. జగదీష్, లయన్. శివ శంకర్ నాయుడు, లయన్ బి. రామకృష్ణ. లయన్ ఉమా మహేశ్వరరావు, మారుతి కళాళాశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.