జిల్లా వైద్యాధికారి భాస్కర్ నాయక్...
ఎస్బిఐ చీఫ్ జనరల్ మేనేజర్ మధుసూధనాశాస్త్రి..
భద్రాచలం (విజయక్రాంతి): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కాలేజ్, లయన్స్ క్లబ్ భద్రాచలం వారి అధ్వర్యంలో ఎస్ఆర్ వాసవి అసోసియేషన్ యుఎస్ఎ. వారి సహకారంతో మారుతి నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన నేత్ర శస్త్ర చికిత్స శిబిరములో 5వ బ్యాచ్లో భాగంగా శుక్రవారం కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమం నిర్వహించినారు. నేటి వరకు ఉచితంగా 700 మందికి కళ్ళజోళ్ళ పంపిణీ చేసి, ప్రఖ్యాతి చెందిన 'పుష్పగిరి కంటి ఆసుపత్రి' సికింద్రాబాద్లో సుమారు 857 మందికి కంటి ఆపరేషన్లు 21 బ్యాచ్లుగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంకు జిల్లా వైద్యాధికారి డా. భాస్కర్ నాయక్, చీఫ్ మేనేజర్ ఎస్బీఐ ఆఫ్ ఇండియా మధుసూధనాశాస్త్రి ముఖ్య అతిధులుగా, డా. బాలాజీ గౌరవ అతిథిగా పాల్గొని కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అంధత్వ నివారణ కొరకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల సేవలను కొనియాడి, వారికి కావలసిన పూర్తి సహకారం అందజేస్తామని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో భాగంగా డా.ఎస్.ఎల్.కాంతారావు డిస్ట్రిక్ కో ఆర్డినేటర్, ప్రోగ్రాం చైర్మన్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ వారి అనుమతితో, ప్రాజెక్టు అధికారి ఐటిడిఎ భద్రాచలం శ్రీ బి.రాహుల్ సహకారంతో పుష్పగిరి కంటి ఆసుపత్రి సారథ్యంలో ఈ కార్యక్రమమును నిర్వహించామని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.ఎస్.ఎల్.కాంతారావు, లయన్.జి. రాజారెడ్డి, లయన్ వై. సూర్యనారాయణ, చారుగుళ్ళ శ్రీనివాస్, డా.వై. భాను ప్రసాద్, డా. వి. కామేశ్వరరావు, ఆప్తల్మిక్ అధికారులు జి.సంజీవరావు, వి.శ్రీనివాసరెడ్డి, తిరుమలరావు, మారుతి కళాళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.