calender_icon.png 12 February, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

1021 కంటి ఆపరేషన్లు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం

12-02-2025 07:22:37 PM

తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి చైర్మన్  పొదెం వీరయ్య...

భద్రాచలం (విజయక్రాంతి): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కాలేజ్, లయన్స్ క్లబ్ భద్రాచలం వారి అధ్వర్యంలో ఎస్ఆర్ఎ, వాసవి అసోసియేషన్ యుఎస్ఎ. వారి సహకారంతో మారుతి నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత నేత్ర శస్త్రచికిత్స శిబిరములో ఆఖరి బ్యాచ్ లో భాగంగా 55 మంది ఎంపిక అయిన రోగులను ప్రఖ్యాతి చెందిన 'పుష్పగిరి కంటి ఆసుపత్రి' సికింద్రాబాద్లో ఆపరేషన్లు నిర్వహించేందుకు బుధవారం వాహనంలో తరలించినారు. ఈ కార్యక్రమమునకు పొదెం వీరయ్య ముఖ్య అతిధిగా పాల్గొని అంధత్వ నివారణ కొరకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల సేవలను కొనియాడి, వారికి కావలసిన పూర్తి సహకారం అందజేస్తామని తెలిపినారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా డా.ఎస్.ఎల్. కాంతారావు డిస్ట్రిక్ కో-ఆర్డినేటర్, ప్రోగ్రాం చైర్మన్ మాట్లాడుతూ... జిల్లా కలెక్టర్ శ్రీజితేష్ వి. పాటిల్ వారి అనుమతితో, ప్రాజెక్టు అధికారి ఐటిడిఎ భద్రాచలం బి. రాహుల్ సహకారంతో పుష్పగిరి కంటి ఆసుపత్రి సారథ్యంలో ఈ కార్యక్రమమును నిర్వహించామని వారికి ధన్యవాదాలు తెలుపుతూ, నేటి వరకు 1021 మందికి కంటి ఆపరేషన్లు పూర్తి చేశామని, 600 మందికి కంటి అద్దాలు ఉచితంగా అందజేశామని తెలిపినారు. ఈ కార్యక్రమానికి 168 మారుమూల గ్రామాల నుండి పేద రోగులు హాజరై పరీక్షలు చేయించుకుని పూర్తి కంటి చూపును పొందినారని డా.ఎస్.ఎల్.కాంతారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ నుండి రొటేరియన్. జి. రాజారెడ్డి, లయన్ వై.సూర్యనారాయణ, చారుగుళ్ళ శ్రీనివాస్, డా.వై. భాను ప్రసాద్, డా. వి. కామేశ్వరరావు, దుమ్ముగూడెం కాంగ్రెస్ మండల నాయకులు వీరమాచినేని వినీల్, గొల్లపూడి వరుణ్, శశిధర్ రెడ్డి మరియు మారుతి కళాళాశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.