calender_icon.png 5 March, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూలే దంపతుల సేవలు చిరస్మరణీయం

26-01-2025 12:33:25 AM

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల, జనవరి 25: అంటరాని తనం, బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన, మహిళా విద్య కోసం పూలే దంపతులు సమాజానికి చేసిన కృషి చిరస్మరణీయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్’కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పూలే పార్కులో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే దంపతుల విగ్రహాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సావిత్రీ బాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్స వంగా అధికా రికంగా జరపాలని ఉత్తర్వులు జారీ చేశార న్నారు. సమ సమాజ నిర్మాణం లో భాగంగా పూలే దంపతుల కృషితోనే ఈరోజు ఈ మాత్రం చైతన్యం కనిపిస్తుంద న్నారు.

బడుగు, బలహీన వర్గాల వారు, మహిళలు రాజకీయాలతో పాటూ వ్యాపార, వాణి జ్యాల రంగాలలో సైతం ప్రస్తుత పోటీ ప్రపం చంలో ముందు వరుసలో నిలవడానికి కారణం పూలే దంపతుల సేవలేనని ఎమ్మెల్యే సంజయ్ పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి మాట్లాడుటూ పూలే దంపతులు చేసిన పోరాటం, చూపిం చిన తెగువ స్ఫూర్తి దాయకమని అన్నారు.

టీబీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్’కుమార్ మాట్లాడుతూ పూలే విగ్రహాల దాత ఎమ్మెల్యేను ఆదర్శ ఎమ్మెల్యేగా కొనియా డారు. పూలే దంపతుల స్పూర్తితో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామని బీసీ సంఘాల ప్రతినిధు లతో  ప్రతిజ్ఞ చేయించారు.   

మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్ వొద్ధి శ్రీలత, టీబీసీ జేఏసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మానాల కిషన్, రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, నాయకులు నరేశ్, కొక్కు గంగాధర్, కస్తూరి శ్రీమంజరి, గంగం జలజ, మున్సిపల్ కౌన్సిలర్లు, ఉద్యోగ, ఉపాధ్యాయ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.