కూకట్‌పల్లి (విజయక్రాంతి): విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసి పదవీ విరమణ పొందుతున్న అధికారుల సేవలు అభినందనీయమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొనియాడారు. జిహెచ్ఎంసి మూసాపేట సర్కిల్ 23 ఉప కమిషనర్ రమేష్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ మల్లేశ్వర్రావు లు ఈనెల 31 న పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా సర్కిల్ కార్యాలయంలో వారినీ శాలువాతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. ఉద్యోగ జీవితం నుంచి విరమణ పొందినప్పటికీ సామాజిక సేవలను కొనసాగించాలని, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కుటుంబానికి అధిక సమయం కేటాయించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి ఉప కమిషనర్ కృష్ణయ్య, మాజీ కార్పొరేటర్ బాబురావు, బీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ తదితరులు, ఇతర అధికారులను సన్మానించారు.