calender_icon.png 6 April, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెబ్బేరు వైద్య సిబ్బంది సేవలు భేష్

02-04-2025 12:47:27 AM

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లే శ్రీనివాసులు

పెబ్బేరు ఏప్రిల్ 1: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒకే రోజు ఆరు ప్రసవాలు చేసినందుకు మంగళవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లే శ్రీనివాసులు సి బ్బంది ని అభినందించారు. సోమవారం రాత్రి  నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు ఆరుగురు గర్భిణీ స్త్రీలు చేరారు. వారందరికీ సిబ్బంది ఓపికతో సాధారణ ప్రసవాలు చేయటంతో జిల్లా వైద్యాధికారి ఆసుపత్రి ని సందర్శించారు.

బాలింతలను, పసి పిల్లలను పరిశీలించారు. వారు ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక వైద్యురాలు డాక్టర్ ప్రవళిక, స్టాఫ్ నర్సు చరిత, కాంటిజెన్సీ వర్కర్ గౌరీ లను అభినందించారు. వీరి సేవలను జిల్లా లోని వైద్య సిబ్బంది ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది లీలమ్మ, స్వరూప రాణి, రాజశేఖర్, రాజేష్ గౌడ్, కృష్ణ, ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.