06-02-2025 12:24:56 AM
శంషాబాద్ డీసీపీ రాజేష్
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 5: ఎస్సై రామ చంద్రయ్య సేవలు అభినందనీయమని శంషాబాద్ జోన్ డిసిపి రాజేష్ కొని యాడారు. 42 సంవత్సరాలు పోలీసు శాఖలో సేవలందించిన ఎస్త్స్ర రామచం ద్రయ్య శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో బుధ వారం ఉద్యోగ విరమణ చేశారు.
ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిసిపి మాట్లాడుతూ.. రామచంద్రయ్య ఎన్నో కీలకమైన కేసులను ఛేదించారని తెలిపారు. అదేవిధంగా ఆయన ఎంతో అంకిత భావంతో, చిత్తశుద్ధితో విధులు నిర్వహిం చారని అన్నారు.
అనంతరం ఆయనను డీసీపీ రాజేష్, అడిషనల్ డీసీపీ తదితరులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో శంషాబాద్ ఇన్స్పెక్టర్ బాలరాజు పలువురు ఇన్‌స్సెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.