రాజేంద్రనగర్, జూలై 14: కోవిడ్ సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలక ట్టలేనివని మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం మణికొండ పరిధిలోని ఎంప్లాయిస్ కాలనీ రోడ్డు లో పారిశుద్ధ్య కార్మికులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.