calender_icon.png 3 April, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ కార్మికుల సేవలు ప్రశంసనీయం

28-03-2025 12:00:00 AM

ఖమ్మం, మార్చి -27 ( విజయక్రాంతి ):-ప్రజల జీవన వ్యవస్థ సజావుగా జరిగేందుకు కృషి చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సేవలు ప్రశంసనీయమనీ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కొనియాడారు.గురువారం ఖమ్మం బస్సు డిపోలో ఆర్టిసి సిబ్బందికి జిల్లా కలెక్టర్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, శరీరం లో రక్తం ఎంత ముఖ్యమో ప్రజలకు సేవలు అందించే ఆర్టిసి కూడా అంతే ముఖ్యమని, ప్రజలకు చాలా సేవలను ఆర్టిసి కార్మికులు అందిస్తున్నారని, వీరి కృషి ఫలితంగా నేడు విద్యార్దులకు విద్య, మహిళలకు ఉపాధి అవకాశాలు, ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందుతున్నాయని ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు.

డ్రైవర్లు, కండక్టర్లు చాలా కష్టపడి పని చేస్తున్నారని, ప్రస్తుత వేసవి కాలంలో వారికి ఉపయోగపడే విధం గా జిల్లా యంత్రాంగం తరుపున 650 బాటి ల్స్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఆర్టిసి కార్మికుల పిల్లల చదువులు, డిపోలో ఇతర సౌకర్యాలు, ఇబ్బందులను తమ పరిధి మే రకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్స్, మెకానికల్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ మల్ల య్య, డిపో మేనేజర్ దినేష్ కుమార్, డ్రైవర్లు, కండక్టర్, సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.