calender_icon.png 20 November, 2024 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే సిబ్బంది సేవలు ఎంతో గొప్పవి

10-09-2024 03:03:20 AM

  1. వారి అంకిత భావంతో తప్పిన ప్రమాదాలు 
  2. సిబ్బంది అప్రమత్తతే ప్రయాణికులకు భద్రత 
  3. ద.మ.రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయ క్రాంతి): ఇటీవల వరదల కారణంగా దెబ్బతిన్న  ట్రాక్‌లను గుర్తించి  చిన్న ప్రమా దం కూడా జరగకుండా కాపాడిన సిబ్బంది సేవలు ఎంతో గొప్పవని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. సోమవారం రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారీ ప్రమాదాలను నివారించిన రైల్వే సిబ్బందిని ఆయన అభినందించారు. ఖమ్మం, మహ బూబాబాద్ వరదల్లో రైల్వే పట్టాలు చాలా చోట్ల దెబ్బతిన్నాయని గుర్తించారన్నారు. వెంటనే అధికారులను, ఆ మార్గంలో వస్తున్న రైళ్లలో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేసి అనేకమంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారని కొనియాడారు.

భారీ వర్షా ల్లోనూ అత్యుత్తమ సేవలు అందించిన ట్రాక్ మెన్లు మోహన్, జగదీశ్, కృష్ణ, బ్రిడ్జ్‌మెన్ జైల్ సింగ్, జేఈ సైదా నాయక్, ఎస్‌ఎస్‌ఈ రాజమమౌళికి సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేశారు. రైల్వే సిబ్బంది అప్రమత్తతే ప్రయాణికులకు భద్రత అందిస్తోందని తెలిపారు. ద.మ.రైల్వే పరిధిలో భద్రతపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సంద ర్భంగా జీఎం వివరించారు. కార్యక్రమంలో పర్ఫార్మెన్స్ అండ్ అచీవ్‌మెంట్స్ (2022 2023 గ్లోరియస్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ బుక్‌లెట్లను విడుదల చేశారు. కార్యక్రమంలో  అదనపు జీఎం నీరజ్ అగర్వాల్, అన్ని శాఖల హెడ్స్ పాల్గొన్నారు.